‘పుష్ప-2’ నుంచి ఫహాద్‌ ఫాజిల్‌ లుక్‌ రిలీజ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ది రూల్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న ఫహాద్‌ ఫాజిల్‌ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఫహాద్‌ ఫాజిల్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

బన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా పుష్ప ది రైజ్‌లో ఆకట్టుకున్న ఫహాద్‌ ఈ చిత్రంలో అంతకు మించి క్రేజీగా ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నాడు. గల్ల లుంగీ ధరించి.. ఒక చేతిలో గన్‌తో…మరో చేతిలో గొడ్డలితో ఫహాద్‌ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది.రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్‌ బంప్స్‌ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్