వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి తోమాల సేవ పేరుతో సిఫార్సు లేఖల అమ్మకంపై టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు చేశారు. గుంటూరు వాసుల నుంచి తోమాల సేవ సిఫార్సు లేఖల కోసం మూడు లక్షల రూపాయలు వసూలు చేశారంటూ చిట్టిబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గుంటూరులోని అరండల్‌పేట పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు చేశారు. అలాగే భరత్ పీఆర్వో మల్లికార్జునపైనా కూడా కేసు నమోదైంది.

అయితే ఈ కేసుపై ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజా టికెట్లు అమ్ముకునేంత దౌర్బాగ్యం తనకు పట్టలేదన్నారు. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశాననే కక్షతో తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని..వాటిని కచ్చితంగా ఎదుర్కొంటానని భరత్ చెప్పుకొచ్చారు.

 

Latest Articles

కర్నూలు జిల్లా కృష్ణగిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సమరం వేళ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసే సమయంలో తీవ్ర కలకలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్