ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు ఆర్ కృష్ణయ్య పిలుపు

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ.. ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన.. బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బీసీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అమలు చేసి.. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో ప్రతిపక్షం ఇప్పుడు బలంగా ఉందని… కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. ఆగస్టు 6న పార్లమెంట్ ముందు చేపట్టే ఆందోళన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు.

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్