క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన ప్రణీత్‌

స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. ప్రణీత్ హనుమంతు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో భగ్గుమన్నారు. అతని వల్గర్ కామెంట్స్‌పై తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. దీంతో ప్రణీత్ బహిరంగా క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు.

సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిధరమ్‌తేజ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడులతోపాటు మరికొందరికి ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరైన ప్రణీత్‌ అమెరికాలో ఉన్నట్లు నిర్ధారించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై టీజీ పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు.. దిగొచ్చాడు. హద్దు దాటానని.. క్షమాపణలు చెప్పాడు. గత రెండు రోజులుగా తన పేరెంట్స్‌ను చాలామంది బూతులు తిడుతున్నారని.. వారిని దయచేసి వదలేయాలని తప్పంతా తనదే అన్నాడు ప్రణీత్. ఈ విషయంలో చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని.. మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని క్లారిటీ ఇచ్చాడు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్