లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో సీబీఐ జూన్ 7న వేసిన ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని, అందుకే ఎమ్మెల్సీ కవితని రిలీజ్ చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సీబీఐ రీఫైలింగ్ చేసిన చార్జిషీట్‌లోనూ తప్పులు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వచ్చే గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణనను శుక్రవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై శుక్రవారం రోజున విచారణ జరగనుంది.
కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
0
246
Previous article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


