హైదరాబాద్ కావూరి హిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న స్వప్నవర్మ ఆత్మహత్యకు పాల్పడింది. మూడు సంవత్సరాల క్రితం సొంతూరు రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన స్వప్నవర్మ.. ఏడాదిగా కావూరి హిల్స్‌లోని తీగల హౌస్ 101 ప్లాట్‌లో ఒంటరిగా ఉంటుంది. గత ఆరు నెలలుగా ఏ ప్రాజెక్టు లేక ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే ఆమె రెండు రోజుల క్రితం తన ప్లాట్‌లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాడీ డీ కంపోస్ట్ అవ్వడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
కావురి హిల్స్ లో విషాదం
0
226
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


