యూపీలోని నోయిడాలో రోడ్డుపై ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారి పైనుంచి కారు వెళ్లింది. నిన్న అర్థరాత్రి సెక్టార్- 63లో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాల పాలవడంతో చిన్నారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లీకూతురు ఇంటి గేటు దగ్గర రోడ్డుపై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా పోలీసులకు సమా చారం అందడంతో వెంటనే రంగంలోకి దిగిన సెక్టార్-63 పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు కారణమైన వాహనాన్ని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు . పరారీలో ఉన్న కారు డ్రైవర్‌ను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు.
ఆడుకుంటున్న చిన్నారి పైనుంచి వెళ్లిన కారు
0
242
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


