వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆది ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా సమీక్షించామని, అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై కౌన్సిల్ సభ్యులకు సూచనలు చేసినట్లు తెలిపారు. పట్టణంలో రోడ్ల వెడల్పు, మధ్యలో నిలిచిపోయిన మూలవాగు వంతెన నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే 20కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయ్యాయని, మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ హామీ ఇచ్చారు.