గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ లో ప్రజాప్రతిని ధులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నాళాలు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు చేపట్టాలన్నా రు. వరంగల్‌లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందు కు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.