పోలవరం ప్రాజెక్టును దారిలో పెట్టడానికి విదేశీ నిపుణులను పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన.. పోలవరాన్ని ఎంతలా ధ్వంసం చేశారంటే, చివరకు దానిని దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులను పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పోలవరానికి విదేశీ నిపుణులు రానున్నా రని తెలిపారు. రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరం అని అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపం లా మారాడన్నారు. వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుని కరవు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది అన్నారు. అలాంటి ప్రాజెక్టు జగన్ చేసిన విధ్వంసానికి గురైందని అన్నారు. 90 మీటర్ల కిందవరకూ డయాఫ్రమ్ వాల్ అత్యాధునిక సాంకేతికతతో పూర్తిచేసాం అని స్పష్టం చేశారు. పో 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104 సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తిoచి 72 శాతం పూర్తి చేశాం అన్నారు. కానీ, జగన్ మూర్ఖత్వం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే 990 కోట్లు అవసరమవుతాయన్నారు.
పోలవరం ధ్వంసం ఎవరి పాపం
0
182
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


