లోక్ సభ స్పీకర్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ

    18వ లోక్‌సభ స్పీకర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందు కు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినే షన్‌ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ బరిలో నిలిచారు.సభాపతి పదవిని అధికార పక్షం, ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా గత హయాంలో డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉప సభాపతి పదవికి పట్టుబ ట్టాయి. స్పీకర్‌ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను భాజపా రంగంలోకి దించింది. ఈ ఉదయం నుంచి ఆయన మల్లికార్జున్‌ ఖర్గే, ఎంకే స్టాలిన్‌ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్‌ పదవి ఏకగ్రీవమ య్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీక రించినప్పటికీ ఉప సభాపతి పదవి కావాలన్న డిమాండ్‌ మళ్లీ ముందుంచాయి. కానీ, దీనికి ఎన్డీయే సర్కారు సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకిదిగాయి. నామినేషన్‌ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్‌ పదవికి ఎన్నిక అనివార్యమైంది. రేపు ఎన్నిక నిర్వహించనున్నారు.

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్