కరీంనగర్ జిల్లా వీణవంకలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వీణవంక నుంచి చెల్పూర్‌కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. తడి బట్టలతో తాను అవినీతి చేయలేదని కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. 100 కోట్ల అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలన్నారు. తాను అవినీతి చేయలేదని దేవుడిపై ప్రమాణం చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఫ్లైయాష్‌తోపాటు ఓవర్ లోడ్ లారీలను ఎందుకు ఆపడం లేదన్నారు. ఓవర్ లోడ్ లారీల నుంచి ఒక్క రుపాయి తీసుకోలేదని పొన్నం ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రమాణం చేస్తే తాను క్షమాపణ చేప్తానన్నారు.తాను ఎలా నిజాయితీని నిరుపించుకున్నానో అలాగే పొన్నం నిరూపించు కోవాలన్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కౌశిక్ రెడ్డి, ప్రణవ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు.
కౌశిక్ రెడ్డి, ప్రణవ్‌ల హౌస్ అరెస్ట్
0
229
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


