తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్జ్

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే నైరుతి రుతపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంగా భారీగా ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో నైరుతి రుతుపవనాలు ఏపీ వ్యాప్తంగా విస్తరిం చాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావ రణ కేంద్రం పేర్కొంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మరో రెండు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Latest Articles

బండి భగీరథ్‌ను అరెస్టు చేశాము.. సరెండర్‌ అవ్వలేదు- రేవంత్‌ రెడ్డి

బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్‌ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్‌ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్