గంజాయి, డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చీరాల మహిళ హత్య గంజాయి మత్తులో నేరం జరగడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ హత్య కేసును స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు నిందితు ల అరెస్ట్ జరిగేంత వరకు కేసు పురోగతిపై నిత్యం ఆరా తీస్తూనే ఉన్నారు.చీరాల మహిళ హత్య కేసులో నిందితులను 48 గంటల్లో అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా ప్రాంతానికి వెళ్లారు హోం మంత్రి అనిత. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉండాలన్న చంద్రబాబు….త్వరలో పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేపట్టనున్నారని తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు మొదలుకుని.. జిల్లా ఎస్పీల వరకు బదిలీలు చేపట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు ఐపీఎస్సులను జీఏడీకి లేదా పోలీస్ హెడ్ క్వార్టర్సుకు త్వరలో బదిలీ చేసే అవకాశం ఉంది.
గంజాయి, డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
0
263
Previous article
Next article
Latest Articles
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు సర్కార్ – వైఎస్ జగన్
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా ఖూనీ చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ...
- Advertisement -
- Advertisement -


