వైసీపీపై తాడిపత్రి ఎమ్మెల్యే ఫైర్‌

    వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని, తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తననూ తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేశామని, బీఎస్-4 వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయన్నారు. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయారు. ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి తమను అరెస్టు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.ఏపీలో మా దగ్గర ఉన్న రూట్ బస్సులు ఎవరి దగ్గరా లేవన్న జేసీ చిన్నచిన్న కారణాలు చూపి బస్సులు సీజ్ చేశారన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని కూడా సీజ్ చేశారని, రెండు బస్సులను వైసీపీ గుండాలు కాల్చేశారని అన్నారు. తన బస్సులను పట్టుకుని అనవసరంగా సీజ్ చేసిన ప్రతి ఒక్కరినీ కోర్టుకు లాగుతా అన్ను ప్రభాకర్‌ రెడ్డి

Latest Articles

విజయ్‌పై నాకు అసూయ లేదు.. కమల్‌హాసన్‌పై ఉండేదేమో- రజనీకాంత్‌

తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలిసారి స్పందించారు. తాను రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంపై అసూయ పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. “విజయ్ సీఎం కావడంపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్