తెలంగాణలో కూరగాయ ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఆకాశానికి అంటుతున్నాయి. దీంతో సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నట్టుండి గత 15 రోజుల్లోనే కొండెక్కి కూర్చున్న కూరగాయాల్సి కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. అధిక ధరల కారణంగా కూరగాయలతో భోజనం చేసే ఆలోచనే లేకుండా పోతోందని వాపోతున్నారు. ఇక వరంగల్ మార్కెట్లోనూ ఏ కూరగాయ ముట్టుకున్న రేట్ల మంటతో భగ్గుమంటున్నాయి. లక్ష్మీపురం మార్కెట్లో టమాటా కేజీ వంద రూపాయలు, దొండకా యలు 80, పచ్చిమిర్చి 70, బీరకాయ100, కొత్తిమీర 150 ఇలా విపరీతమైన ధరలతో కూరగాయలు మండిపోతుంటే ఏం తినేట్టు ఉన్నామని నిట్టూరుస్తున్నారు పేద, మధ్య తరగతి ప్రజలు. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి తగ్గిన కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్నం టాయి. బెంగళూరు, రాజస్థాన్, గుజరాత్‌ల నుండి కూరగాయల దిగుమతి జరుగుతోంది. అయితే ట్రాన్స్ పోర్టు ఖర్చుతోపాటు హమాలీ ఖర్చులు అధికమవడం, తెచ్చిన వెజిటెబుల్స్ కుళ్లిపోవడం వంటి కారణం గా ధరలు పెంచక తప్పదంటున్నారు వ్యాపారస్తులు. ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలయ్యాయి కాబట్టి లోకల్ సరుకు వచ్చే వరకు ధరల భారం తప్పదని సూచిస్తున్నారు. తాము కొనుక్కుని తినకుండా పెరిగిన ధరలను నియంత్రించాలని, తక్షణమే ప్రభుత్వం చొరువ తీసుకుని అందుబాటు ధరలో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.