రెండున్నరేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్‌లోని తన చాంబర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన సీట్ లో కూర్చుని బాధ్యతలు తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతి కోసం 32 వేల ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని.. గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ అన్నారు. ఏపీ ప్రజల శ్రేయస్సుకోసం అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. రెండున్నర ఏళ్లలో అమరావతిని నిర్మించి దేశంలోని టాప్-5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయ ణ ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ
0
262
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


