ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితి గతులను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 9.30కి ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంత మంతా తిరిగి ప్రతి నిర్మాణాన్నీ పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవారంగా పిలిచేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్నీ చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరం లో కుడికా లువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65% పనులు పూర్తయ్యాయి.
గత ఐదేళ్లుగా ప్రాజెక్టు పనులు ఎక్కడి కక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రావడం ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ప్రాజెక్టును సందర్శిం చడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్ర బాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం గ్యాప్ 3 పనులు పూర్తయ్యాయి. గ్యాప్ 1, 2 ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పనులు పూర్తి చేయాల్సి ఉంది. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో నూతనంగా నిర్మించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిం చారు. డిజైన్స్ ఆమోదం కాగానే డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపా రు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్య స్నేహపూర్వకంగా ఉన్న నేపథ్యంలో పనులు మరింత వేగవం తంగా జరుగు తాయని రానున్న మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న నేతలు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.