ఏపీలో పూర్వ వైభవాన్ని సంతరించుకున్న టీడీపీ

     కూటమి ఘన విజయం సాధించడంతో రాబోయే రోజుల్లో. 2014 మాదిరిగా అభివృద్ధి రాష్ట్రంలో పరుగు లు తీస్తుందని అంతా భావిస్తున్నారు. తెలుగుదేశం గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించిన వారిలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ చాలా కీలకంగా మారారు. తన పాదయాత్రతో ఏపీలో తెలుగుదేశానికి ఊపిరులూదారు లోకేష్.

     ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో మూడు పార్టీల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశంజెండా రెపరెపలాడుతోంది. పసుపుదళం హుషారుగా ఉంది. పార్టీ ఇంతటి ఘన విజయం సాధించడంలో తనవంతుగా కీలకపాత్ర పోషించిన వారిలో టీడీపీ తరపున చంద్రబాబు ముందుంటే ఆ తర్వాత స్థానం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌దేనని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఎప్పటి కప్పుడు పార్టీ నేతలు, జిల్లాల వారీగా, మండలాల వారీగా టీడీపీ అధ్యక్షులు, నేతలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని పరుగులు పెట్టించారు. ఓవైపు క్షేత్రస్థాయిలో వైసీపీ నేతల ఆగడాలు ఎక్కువవుతున్నాయని టీడీపీ నాయకులు చెప్పడంతో తెలుగుదేశం కేడర్ చెల్లాచెదురు కాకుండా చూసేందుకు, వారిలో మనోస్థైర్యం నింపేందుకు రెడ్‌ బుక్‌ను తీసుకొ చ్చారు. అందులో వైసీపీ నాయకుల పేర్లే కాదు. వైసీపీకి వత్తాసు పలుకుతున్న అధికా రుల పేర్లను సైతం రాసుకుంటున్నానని అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తప్పదని ప్రకటించారు. తద్వారా టీడీపీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు తన వంతు ప్రయత్నం చేశారు నారా లోకేష్.

   కేవలం ఇదే కాదు. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయి శ్రేణులన్నీ నిస్తేజంగా ఉండడంతో వస్తున్నా మీ కోసం అంటూ పాదయాత్ర చేశారు నారా లోకేష్. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి 2023 జనవరి 27న పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్‌ ఏపీలోని 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 232 మండలాలు వాటి పరిధిలోని 2 వేల 28 గ్రామా లను కవర్ చేస్తూ 236 రోజుల పాటు పాదయాత్ర చేశారు నారా లోకేష్. మొత్తంగా 3 వేల 132 కి.మీ దూరం పాటు నడిచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఎక్కడికక్కడ ప్రజల ఇబ్బందులు, కష్టాలు తెలుసుకుంటూ పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ రాబోయేది మన సర్కారేనంటూ ముందుకు సాగారు నారా లోకేష్.

    అభ్యర్థుల ఎంపికలోనూ తనదైన మార్కు ప్రదర్శించారు నారా లోకేష్. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కొంత మొహమాటం పడినా. లోకేష్ మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించారన్న పేరు సంపాదించారు. గెలు స్తారన్న వారికే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చారు నారా లోకేష్. ఇలా ఒకటీ రెండూ కాదు. పార్టీ పరంగా పైకి చంద్రబాబు కన్పించినా తెరవెనుక మాత్రం అన్నీ తానై చినబాబు లోకేష్ చక్రం తిప్పారన్న వాదన బలంగా విన్పిస్తోంది.

Latest Articles

గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్‌గానే బీజేపీ బరిలోకి దిగుతోందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్