రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. పార్టీల నేతలు సంయమనం పాటించాలని సూచించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్‌ను పక డ్బందీగా అమలు చేస్తాం అన్నారు. 30 పోలీస్ యాక్ట్‌ను ఉల్లంఘించి అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్ప దని డీఎస్పీ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. కుప్పం లో మంగళవారం 120 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు.


