ఖమ్మం లోక్ సభ స్థానం గెలుపుపై బెట్టింగ్ జోరు

    ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందేలను మించి బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఆంధ్రాలో అధి కారం ఎవరిది..?, ఖమ్మంలో ఎంపీ సీటు గెలిచే మొనగాడెవరు అన్నదానిపై లక్షలే కాదు.. కోటి వరకూ కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు.

  ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా బెట్టింగ్‌ రాయుళ్లకు కేంద్రంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఫలితాలపై పందేలుకాస్తు న్నారు. ఆంధ్రాలో అధికా రంలోకి ఎవరు వస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ, విపక్ష కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిన వేళ ఫలితాలపై 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు భారీ ఎత్తున పందేలు కాస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల సరిహద్దు ఉంది. దాదాపుగా పది నియోజకవర్గాలు బార్డర్‌లో ఉన్నాయి. ఈ కారణంగానే భద్రాచలం, సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల సరిహద్దులన్ని ఇప్పుడు పందెం రాయుళ్లతో నిండిపో యాయి. ఇక్కడ ఉండే బంధు త్వాలు, వ్యాపారాలు అన్ని ఆంధ్ర ప్రాంతం వారితోనే ఎక్కువగా ఉండటంతో వారికి ఆంధ్ర రాజకీయంతో అనుబంధం ఎక్కువ. అందుకే ఏపీ పాలిటిక్స్‌ పై ఇక్కడ పందేలు జోరుగా సాగుతు  న్నాయి.

   సరిహద్దు కారణంగా ఏపీ పాలిటిక్స్‌ ఎఫెక్ట్‌ ఖమ్మం జిల్లాపై పడింది. ఆంధ్రాలో కుల రాజకీయం తెలం గాణ కంటే ఎక్కువే అని అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగానే ఇక్కడ కులాల వారీగా చీలిపో యారు. ఇక ఆంధ్రా రాజకీయాలపై మక్కువ ఉన్న ఖమ్మం వాసులు. పందేలకు దిగుతున్నారు. విపక్ష కూటమి గెలుస్తుందా..? వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందా అన్న దానిపై పందేలు శృతి మించాయి. యాబైవేలకు లక్షన్నర, రెండు లక్షల పందేలు కాస్తున్నారు. ఇలా యాబై వేల నుంచి కోటి రూపాయల వరకూ బెట్టింగ్‌ జోరు నడుస్తో్ంది. ఇక పందేల కోసం కొన్ని యాప్‌లు కూడా పుట్టుకువ చ్చాయి. యాప్‌ల లో చూసి పందేలు కాస్తున్నారంటే బెట్టింగ్‌ మాఫియా ఏ స్థాయిలో జోరందుకుందో అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఎవరు పందెం కాస్తున్నారు..? ఎంత పందెం కాస్తున్నారో యాప్‌ ద్వారా తెలుసు కోవచ్చు. ఇకపోతే బెట్టింగ్‌లో మధ్యవర్తుల పాత్ర కీలకం. ఓ ఇద్దరు పందెం కాస్తుంటే ఆ డబ్బులు మధ్య వర్తి వద్దకు చేరుతాయి. పందెంకు మద్యవర్తిగా ఉన్న వ్యక్తికి ఇందులో పర్సెంటేజ్‌ ఉంటుంది. అలాగే, పందెంలో ఓటమిపాలు అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే అది మధ్య వర్తే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సాగుతోంది ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం.

    ఆంధ్రా రాజకీయాలే కాదు. తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్‌పై కూడా బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు త్రిముఖ పోరు సాగింది. దీంతో ఖమ్మం పార్లమెంట్‌ సీటు గెలిచేది ఎవరన్నదానిపై పందేలు జోరుందుకున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం, నియోజక వర్గాల్లో హస్తం హవాతో చేతి గుర్తే గెలిచి తీరుతుందని పందెం కాస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. గెలవడమే కాదు.. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారన్న దానిపై కూడా బెట్టింగ్‌ నడుస్తోంది. అయితే, ఇంతలా బెట్టింగ్‌ వ్యవహారం జోరందు కున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఫలితాలు బెట్టింగ్‌ రాయుళ్లకు కలిసొస్తాయో.? లేదంటే అంచనాలు తారుమారయి కొంప ముంచుతాయో జూన్‌ 4వ తేదీన రిజల్ట్‌ వస్తే తప్ప తేలేది కాదు. దీంతో పందెం రాయుళ్లు ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని కాచుకుకూ ర్చున్నారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్