కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌

     సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుం టున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఓటు వేశారు. UP సీఎం యోగి ఆదిత్యానాథ్ ఓటు వేశారు. రాఘవ్ చద్దా, రవికిషన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకుర్, ఆర్‌.కె.సింగ్, మహేంద్రనాథ్‌ పాండే, పంకజ్‌ చౌధరీ, అనుప్రియా పటేల్‌ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు.

    ఏడో దశలో పంజాబ్‌లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 9, బీహార్‌లోని 8, ఒడిశాలోని 6, జార్ఖండ్‌లోని 3, చండీగఢ్‌లోని ఒక స్థానానికి కూడా ఓటింగ్ జరగనుంది. చివరి దశ ఓటింగ్‌లో ఒడిశా అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాలతో పాటు, హిమాచల్ అసెంబ్లీలోని ఆరు స్థానాల ఉపఎన్నికలకు కూడా ఓటింగ్ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.18వ లోక్‌సభను కొలువు దీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ దశలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించను న్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా.. ఇప్పటివరకు ఆరు దశల్లో 486 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌తోపాటు ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్‌ కొనసాగుతోంది. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఈ దశలోనే పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం చరణ్‌ జీత్‌సింగ్‌ చన్నీ, కేంద్ర మాజీమంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్