ఈసారి ఉత్తరప్రదేశ్ రాజకీయాల స్వరూపం మారింది. క్షేత్రస్థాయిలో పట్టున్న సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ పార్టీ ఒక జట్టుగా బరిలోకి దిగాయి. దీంతో ముస్లిం ఓట్‌బ్యాంక్ ఇండియా కూటమివైపు పోలరైజ్ అయిందన్న సంకేతాలు అందుతున్నాయి. దీంతో ఈసారి భారతీయ జనతా పార్టీకి గెలుపు నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాదు. అలాగే ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తగ్గిస్తారన్న ప్రచారం జోరందుకుంది. అంతేకాదు లోక్‌సభలో 400 సీట్లను సంఖ్యను చూసుకుని అసలు ఏకంగా మొత్తం రిజర్వేషన్లను నరేంద్ర మోడీ సర్కార్ తొలగిస్తుందన్న ప్రచారం కూడా బలహీనవర్గాల్లో దూసుకెళ్లింది. అయితే ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల్లో కూడా సోషల్ ఇంజనీరింగ్‌నే నమ్ముకుంది కమలం పార్టీ.
ఈసారి ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ఆశించినంతగా జోష్ కనిపించలేదు. 2014,2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వచ్చిన ఊపు ఈసారి ఎన్నికల్లో కనిపించలేదు. అయోధ్య అంశం తొలిరోజుల్లో బాగా హైప్ క్రియేట్ చేసింది. ఆ తరువాత రామమందిర అంశం హైప్ చప్పబడిందన్న సంకేతాలు అందాయి. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ మూడు నెలల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నరేంద్ర మోడీ హవా విపరీతంగా కనిపించింది.అయితే సమరోత్సాహం ఒక్కసారి శిఖరస్థాయికి వెళ్లాక ఆ తరువాత చల్లా రింది. అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి నాయకులు, కార్యకర్తల్లో సదరు ఉత్సాహాన్ని ఉదాసీనత భర్తీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా గణనీయంగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో నలభై నుంచి యాభై శాతం వరకు ముస్లిం జనాభా ఉంటుంది. కిందటిసారి ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ విడివిడిగా పోటీ చేశాయి. దీంతో ముస్లిం ఓట్‌బ్యాంక్ చీలిపోయింది. అయితే హిందూ ఓట్‌బ్యాంక్ పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు పోలరైజ్ చేసింది. దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 నియోజకవర్గాల్లో ఒక్క రాయ్‌బరేలీ మినహా అన్నిట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్ రాజకీయాల స్వరూపం మారింది. క్షేత్రస్థాయిలో పట్టున్న సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ పార్టీ ఒక జట్టుగా బరిలోకి దిగాయి. దీంతో ముస్లిం ఓట్‌బ్యాంక్ ఇండియా కూటమికి అనుకూలంగా మారిందన్న సంకేతాలు అందాయి. ఈ పరిణామాలతో ఈసారి భారతీయ జనతా పార్టీకి గెలుపు నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు . ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ బీజేపీకి స్పష్టమైన ప్రభంజనం అంటూ ఏమీ కనిపించలేదు. అనేక నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్న సంగతి బయటపడింది. నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని గెలుస్తున్న ఎంపీలు, తమ నియోజకవర్గాలకు చేసిందేమీలేదన్న అసంతృప్తి స్థానికుల్లో చాలా చోట్ల కనిపించింది.
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని రెండు సవాళ్లు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మొదటి అంశం…యూపీలో మొదటి రెండు దశల్లో ఓటింగ్ దాదాపు ఐదు శాతం తగ్గింది. డజను కంటే కొంచెం ఎక్కువ నియోజకవర్గాల్లో దాదాపు 8.9 లక్షల ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ప్రతి పోలింగ్ బూత్‌లోని ఒక్కో ఓటును ఎంతో విలువైనదిగా భావించే కమలం పార్టీకి ఇది నిస్సందేహంగా ఆందోళనకరమే. అయితే సహజంగా భారీ ఎత్తున ఓటింగ్ శాతం నమోదు అయితే అది సర్కార్ వ్యతిరేకతకు ప్రతిబింబింగా భావిస్తారు. ఓటింగ్ శాతం తగ్గిందంటే పాలకపక్షాలకు ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తారు. ఈ లెక్కలు వేసుకుని తమకు జరిగే నష్టమేమీ లేదని ఒక అంచనాకు వచ్చారు కమల నాథులు. ఇక రెండో అంశం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు. అబ్ కీ బార్ చార్ సౌ పార్అం టూ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపున ఈసారి బూమెరాంగ్ అయింది.కమలం పార్టీని కొంతవరకు ఈ నివాదం ఇబ్బంది పెట్టింది. రిజర్వేషన్లు తగ్గించడానికి వీలైతే సంపూర్ణంగా తొలగించాలన్న ఉద్దేశంతోనే భారతీ య జనతా పార్టీ 400 సీట్లు ఆశిస్తోందన్న ప్రచారం బలహీనవర్గాల్లోకి వెళ్లింది. దీంతో బీజేపీకి ఓట్ బ్యాంక్ గా ఉన్న కొన్ని బలహీనవర్గాలు పునరాలోచనలో పడినట్లు వార్తలందుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల నాథుల్లో ఆందోళన మొదలైంది.
ఇందిర మనవడు, మేనకా గాంధీ తనయుడు అయిన ఫిరోజ్ వరుణ్ గాంధీకి ఈసారి ఫిల్‌భిత్ నుంచి టికెట్ ఇవ్వలేదు. వాస్తవానికి ఫిల్‌భిత్ నియోజకవర్గానికి వరుణ్ గాంధీ సిట్టింగ్ ఎంపీ. అయితే కొంతకాలంగా బీజేపీ అగ్రనాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వరుణ్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఈసారి వరుణ్ గాంధీకి మొండి చెయ్యి చూపించింది కమలం పార్టీ అగ్రనాయకత్వం. అయితే టికెట్ రాకపోవడంతో సామాన్యుల్లో వరుణ్ గాంధీ పట్ల సానుభూతి పెరిగింది. అయితే వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించడం. చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాలపై పడే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే , బీజేపీ ఇబ్బందుల్లో పడినట్లే. అయితే ఎప్పటిలాగే సోషల్ ఇంజనీరింగ్ కు ఈసారి ఎన్నికల్లో ప్రాధాన్యం ఇచ్చింది కమలం పార్టీ. ప్రతిపక్షాల్లో పలుకుబడి ఉన్న నాయకులను తమ శిబిరంలోకి లాక్కోవడంలో కమలం పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను అలాగే సమాజ్‌వాదీ పార్టీని తగ్గించడంలో కమలం పార్టీ విజయం సాధించింది. అయితే ఇటావా, మైన్‌పురి, కన్నౌజ్‌లలో మాత్రం బీజేపీ ప్రయత్నాలు వర్క్ అవుట్ కాలేదు. ఈ మూడింటితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఓట్‌బ్యాంక్‌గా ఉన్న యాదవులపై ఈసారి కమలం పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టింది. యాదవులను తమ వైపు ఆకర్షితులు చేసుకునే ఎత్తుగడల్లో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను ప్రచారంలోకి దింపింది భారతీయ జనతా పార్టీ. అయితే మోహన్ యాదవ్ కార్డు ఈ ఎన్నికల్లో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాల్సిందే.
రాయ్‌బరేలీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్న నియోజకవర్గం. ఇందిర కుటుంబానికి రాయ్‌బరేలీ కంచుకోట. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాయ్‌బరేలీనే. వాస్తవానికి 2019లో రాయ్‌బరేలీ సెగ్మెంట్‌ను కూడా కాంగ్రెస్ కోల్పోయేది. అయితే ప్రత్యర్థి బలహీనుడు కావడం వల్లనే సోనియా గాంధీ గెలుపొందారన్న ప్రచారం లక్నో రాజకీయవర్గాల్లో ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా రాయ్‌బరేలీలో జెండా ఎగరేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎదిగి వచ్చిన దినేశ్ సింగ్‌కు ఈసారి టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది బీజేపీ హైకమాండ్. ఇదిలా ఉంటే, తమ కుటుంబానికి చెందిన వారెవరూ బరిలో లేకపోతే, పుట్టి మునిగిపోతుందన్న సంకేతాలు సోనియా కుటుంబానికి అందా యి. రాయ్‌బరేలీ కోల్పోతే దేశవ్యాప్తంగా తలెత్తుకోలేమన్న భయం సోనియా కుటుంబసభ్యులకు కలిగి ఉండొచ్చు. దీంతో హుటాహుటిన రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. రాయ్‌బరేలీని గెలుచుకుని, సదరు నియోజకవర్గం ఇప్పటికీ తమ కంచుకోటేనని చాటడానికి రాహుల్ సన్నద్ధమ య్యారు. ఏమైనా కుటుంబానికి కంచుకోటలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం గెలుపు కోసం రాహుల్ గాంధీ చెమటోడ్చుతున్నారు.


