ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సౌమ్యుడిగా రాజకీయాల్లో పేరుంది. అయితే ఆరోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ సైన్యంతో నవీన్ పట్నాయక్ ఒంటరిపోరు చేయక తప్పలేదు పట్నాయక్ విషయంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కమలం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది.దీంతో అందివచ్చిన అవకాశాన్ని వదులు కోకూడదని కమలం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఒడిశాను పాతికేళ్లుగా పాలిస్తున్నప్పటికీ, పట్నాయక్‌కు జిల్లా ప్రధాన కేంద్రాల పేర్లు కూడా తెలియవంటూ ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు అగ్నిపరీక్షగా మారాయి. ఒడిశాలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నాయకుడిగా నవీన్ పట్నాయక్ పేరు తెచ్చుకున్నారు. నవీన్ పట్నాయక్ మూస రాజకీయవేత్త కాదు. నవీన్ పట్నాయక్ నూటికి నూరు శాతం భిన్నమైన వ్యక్తి. ఉన్నత చదువులు చదివారు. పెద్ద పెద్ద చదువులు చదవడమే కాదు. సాహిత్యంలోనూ ఆయన అందెవేసిన చేయే. పట్నాయక్‌కు సాహిత్యం అంటే బాగా ఇష్టం. వేలాది పుస్తకాలు చదివారు. చదవడంతోనే ఆయన సరిపెట్టుకోలేదు. నవీన్ పట్నాయక్ అనేక పుస్తకాలు రాశారు. అంతేకాదు పట్నాయక్‌కు లలిత కళలన్నా ఇష్టమే. ఆయిల్ పెయింటింగ్‌లను బాగా ఇష్టపడతారు. ఆయన నివాసంలో ఎటుచూసినా దేశ, విదేశాల కు చెందిన పెయింటింగ్‌లు కనిపిస్తాయి.
నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ ఒడిశా రాజకీయాల్లో తిరుగులేని నేత. ఆధునిక ఒడిశా రూపకర్తగా బిజూ పట్నాయక్‌ను పేర్కొంటారు. ఈ నేపథ్యంలో తండ్రి బిజూ పట్నాయక్ వారసుడిగా బిజూ జనతాదళ్ బీజేడీ పేరుతో నవీన్ పట్నాయక్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఒడిశా రాజకీయాల్లో నవీన్ పట్నాయక్ అంచెలంచెలుగా ఎదిగారు. 2000 సంవత్సరం మార్చి ఐదో తేదీన తొలిసారి ఒడిశా ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు నవీన్ పట్నాయక్. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. ప్రస్తుతం ఒడిశాకు ఐదోసారి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ పట్నాయక్ జాతీయ రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోరు. ఆయన ఆలోచనలన్నీ స్వంత రాష్ట్రం ఒడిశా అభివృద్ధి మీదే ఉంటాయి. ఒడిశా ప్రయోజనాలే తమకు ముఖ్యమంటారు నవీన్ పట్నాయక్. పాతికేళ్లుగా ముఖ్య మంత్రిగా కొనసాగుతున్నా, అవినీతి మరక అంటని రాజకీయ జీవితం నవీన్ పట్నాయక్‌ది. అయితే నవీన్ పట్నాయక్ ఎంతటి నిజాయితీపరుడోనన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు పట్టించు కోవడం లేదు. అసలు ఆ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు ప్రస్తావించడానికి ఇష్టపడటం లేదు. పరిపాల నకు సంబంధించి కొంతమంది అధికారులపై ఆయన ఆధారపడటంపైనే ప్రత్యర్థులు దాడి చేశారు. ప్రత్యర్థు లంటే ఎవరో కాదు. భారతీయ జనతా పార్టీనే. బిజూ జనతాదళ్ ఈ ఎన్నికల్లో ఇటు కమలం పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉంది. దీంతో రాజకీయంగా ఒంటరివాడైన నవీన్ పట్నాయక్‌పై కమలనాథులు ఎడాపెడా దాడి చేశారు. అంతేకాదు సామాన్య ప్రజల్లో నవీన్‌పై వ్యతిరేకత ప్రబలుతుం దన్న వార్తలు రావడంతో దాడి తీవ్రతరం చేసింది బీజేపీ అధిష్టానం.
ఇక్కడో ఓ అధికారి గురించి ప్రస్తావించుకోవాలి. ఆయనే వి.కార్తికేయ పాండ్యన్. గతంలో ఐఏఎస్ అధికారిగా ఒడిశా రాష్ట్రానికి సేవలందించారు. వెనుకబడిన ఒడిశాను అభివృద్ధి పథంలో నడపడానికి ఐఏఎస్ అధికారిగా కార్తికేయ పాండ్యన్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. పాండ్యన్ భార్య కూడా ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారే. అయితే ఒడిశా రాష్ట్ర అభివృద్దికి పాండ్యన్ అందించిన సేవల గురించి బీజేపీ మాట్లాడటం లేదు. కేవలం ఒడిశా సంస్కృతీ, సంప్రదాయలను కాలరాస్తున్నారంటూ కమలం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నవీన్ పట్నాయక్‌ను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించి వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా పాండ్యన్‌ను టార్గెట్ చేసు కుంది. పాండ్యన్ మీద సకల ఆయుధాలను ఎక్కుపెట్టింది. ఇదిలా ఉంటే తనపై వచ్చిన విమర్శలకు కార్తికేయ పాండ్యన్ బదులిచ్చారు. తాను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అనేది అప్రస్తుతమ న్నారు పాండ్యన్. తమిళనాడు తన జన్మభూమి అయితే ఒడిశా తన కర్మభూమి అంటూ వివరణ ఇచ్చారు పాండ్యన్. ఆయన అక్కడితో ఆగలేదు. మరో అడుగు ముందుకేశారు. తనను తాను మొదట భారతీ యుడిగా పేర్కొన్నారు. ఆ తరువాతే తమిళ వ్యక్తిని అని అభివర్ణించుకున్నారు.
ఈసారి ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ గెలిస్తే, నవీన్ పట్నాయక్ ఆరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇది అందరికీ తెలిసిన విషయమై. అయితే పట్నాయక్ విషయంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కమలం పార్టీకి సంకేతాలు అందాయి. దీంతో అందివచ్చిన అవకాశాన్ని వదులు కోకూడ దని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. నవీన్ పట్నాయక్‌పై రాజకీయ దాడులు తీవ్రతరం చేసింది. నవీన్ పట్నాయక్ పై రాజకీయంగానే కాదు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగింది కమలం పార్టీ. ఒడిశాను పాతికేళ్లుగా పాలిస్తున్నప్పటికీ, నవీన్ పట్నాయక్‌కు జిల్లా ప్రధాన కేంద్రాల పేర్లు కూడా తెలియవు. ఇక ప్రజల కష్టాలు, నష్టాలు ఏం తెలుస్తాయి ? అంటూ ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నవీన్ పట్నా యక్. ఒడిశా అభివృద్ది కి కేంద్ర ప్రభుత్వం చేసింది శూన్యమని మండిపడ్డారు. సంస్కృత భాష అభివృద్ది కి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిన నరేంద్ర మోడీ సర్కార్, ఒడిశా ప్రగతి కోసం రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఎదురుదాడి చేశారు.
వాస్తవానికి భారతీయ జనతా పార్టీతో బిజూ జనతా దళ్‌కు మొదట్లో సత్సంబంధాలే ఉండేవి. నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు నవీన్ పట్నాయక్ పార్టీ అడగకుండానే మద్దతు ఇచ్చింది. అంతేకాదు.నవీన్ పట్నాయక్ కూడా మితవాద హిందూత్వవాదే. ఒడిశాలో ఆలయాల పునరుద్దరణకు ఈ ఏడాది నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించారు నవీన్ పట్నాయక్. అంతేకాదు పూరీ జగన్నాథ ఆలయ పునరుద్దరణ కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయితే ఒడిశా మీద పూర్తి అధికారాన్ని సంపాదించాలన్నది కమలం పార్టీ ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది. బిజూ జనతాదళ్‌కు ఒక మిత్రపక్షంగా ఉండటానికి కమలం పార్టీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నా యక్‌పై ఘాటు విమర్శలు చేశారు కమలనాథులు. దీంతో నరేంద్ర మోడీ సైన్యంతో నవీన్ పట్నాయక్‌కు ఒంటరి పోరాటం చేయక తప్పలేదు. నవీన్ పట్నాయక్ అవివాహితుడు. ఒడిశా ప్రజలే తన కుటుంబం అంటారు నవీన్ నవ్వుతూ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, నిరాడంబర జీవితాన్ని గడపడానికే నవీన్ ఇష్టపడుతుంటారు.ప్రొటోకాల్ నిబంధనలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు చెప్పుకోవాలంటే చాలా సులభంగానే నవీన్ పట్నాయక్ అప్పాయింట్ మెంట్ దొరుకుతుంది. సాయంత్రం వేళల్లో నివాసం ఉంటున్న డాబా పైకి ఎక్కి కింద రోడ్డుమీద పోతున్న ప్రజల ను చూస్తూ కాలం గడుపుతుంటారు నవీన్ పట్నాయక్. రెండు దశాబ్దాలకుపైగా ముఖ్యమంత్రిగా కొనసాగు తున్నా, అవినీతి మరక అంటని రాజకీయ జీవితం నవీన్ పట్నాయక్‌ది.


