చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. రాచకొండ పోలీసు బృందాలు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చనున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. పిల్లలు లేని వ్యక్తుల సమాచారం సేకరించి వారికి పిల్లలను విక్రయిస్తున్నారు ముఠా సభ్యులు. ఢిల్లీ, పంజాబ్, పుణె, ఏపీకి చెందిన అంతరాష్ట్ర ముఠా ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను నియమించుకుంది. వారంతా ఏడాది నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నారు. దీని గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. రాచకొండ సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి పిల్లలను విక్రయి స్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.


