30.2 C
Hyderabad
Friday, June 21, 2024
spot_img

సమస్యల వలయంలో ఆదర్శ పాఠశాలలు

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మండలస్థాయిలో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసింది. పరిగి మండల పరిధిలోని జాఫర్పల్లి గ్రామ శివారులో 2016లో ఆదర్శ పాఠశాల భవనాన్ని నిర్మించిం ది. మౌలిక సదుపాయలను మరిచారు. ఈ ఆదర్శ పాఠశాలలో 8 ఏళ్లుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నా ఉన్నతాధికారులు స్పందించడంలేదని పలు వురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని యాజమాన్య కమిటీ పేర్కొంది. ఈ సెలవుల్లోనైనా సమస్యలు పరిష్కరిం చాలని కోరుతోంది.

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం 5 మండలాల పరిధిలో 4 మండలాల్లో ఆదర్శపాఠశాలలను ఏర్పాటుచేసింది. పూడూరు లోని ఎన్కెపల్లి లో, కులక్చర్లలోని ముజాహిద్ పూర్, గండీడ్ లోని వెన్నచెడ్ గ్రామం,, పరిగి లోని జాఫర్ పల్లి గ్రామాలలో ఈ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. జాఫర్పల్లిలో 6-10 తరగతి వరకు మొత్తం 500 మంది, జూనియర్ కళాశాలలో మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 300 మంది మొత్తం 800 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ప్రతి 50 మందికి ఓగది చొప్పున 22 గదులు తరగతులకు, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్ కోసం, సిబ్బందికోసం 6 గదులను వినియోగిస్తున్నారు… కానీ విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మాణం మరిచారు. కనీసం బాలికల కోసం 12, బాలుర కోసం 12 మరుగుదొడ్లు అవసరమని యాజమాన్య కమిటీ పేర్కొంది.సిబ్బంది కోసం నిర్మించిన 10 మరుగుదొడ్లలో 4 బాలికలు, 6 బాలురు వాడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 800 మంది విద్యార్థులకు నిర్దేశిం చిన సమయం సరిపోక మూత్రశాలకు వెళ్లలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో చదువుపై శ్రద్ధ చూపలేక పోతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బాలురు ప్రహరీ పరిసరాల్లోనే మూత్రవిసర్జన చేస్తుండడంతో ఆప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతోంది. ఆటస్థలం విశాలంగా ఉన్నా.. ఎగుడు దిగుడుగా ఉండటంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతు న్నారు. కొందరు గాయాల పాలవుతున్నా, పలువురు విద్యార్థులు జిల్లా స్థాయిలో రాణిస్తున్నారు. విద్యా ర్థుల దేహ ధారుఢ్యం కోసం ఆడే ఆటలకు ఆట స్థలం చదునుగా లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. ఆటలపై మక్కువ ఉన్నా ఆడలేకపో తున్నామని, ఆటస్థలం చదును చేయించాలని పలువురు విద్యార్థు లు కోరుతున్నారు.

వంట గది లేక నిర్వాహకులు అవస్థలు పడుతూ ఆరు బయటే వండుతున్నారు. ఎండా, వాన, గాలి వీస్తున్నా, ఆరు బయటే వండుతుండడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంలేదు. పా ఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కంరించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పలు మార్లు పాఠశాలను సందర్శించిన ప్రజా ప్రతినిధులు శౌచాలయాలను నిర్మిస్తామని, ఆట స్థలాన్ని చదును చేయిస్తామని చెప్పారు. కానీ సమస్యలు అలాగే ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థుల సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆదర్శ పాఠశాలలో నెలకొని వున్న పలు సమస్యలను పరిష్కరించాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Latest Articles

‘పోలీస్ వారి హెచ్చరిక’ లోగో లాంచ్ చేసిన డైరెక్టర్ తేజ

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై బెల్లి జనార్థన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్