రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బిల్డర్ మధు హత్యకేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కర్ణాటక పోలీసు బృందం చింతల్‌కు వచ్చింది. బీదర్‌కి కేసినో ఆడదామని ప్లాన్ ప్రకారమే బిల్డర్ మధును తీసుకెళ్లిన రేణుక ప్రసాద్, అతని స్నేహితులు అక్కడే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. హత్యలో రేణుకా ప్రసాద్ తో పాటు అతని స్నేహితుల పాత్రపై ఆరా తీస్తున్నారు. రేణుక ప్రసాద్, చింతల్, వాజిపేయి నగర్‌కి చెందిన వరుణ్, సిద్దార్థ్ రెడ్డిలను విచారణ జరిపినట్టు సమాచారం. కర్ణాటకలో హత్య జరిగిన రోజు నుంచి రేణుక ప్రసాద్, వరుణ్, సిద్దార్థ్ రెడ్డి లు పరారీలో ఉన్నారు. నిందితులు ప్లాన్ ప్రకారమే మేడ్చల్ కోర్టులో ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆస్తి కోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
బిల్డర్ మధు హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
0
327
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


