క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనిలో ఉంటున్నా నూరిల్లా ,రిజ్వనా అనే భార్యా భర్తలను సైబర్ నేరగాళ్ళు బురిడీ కొట్టించారు. నూరిల్లా, భార్య రిజ్వనాలకు కొద్ది రోజులక్రితం ఆర్ బీఎల్ బ్యాంకు నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఆ తరువాత వాటిని యాక్టివేట్ చేయాలనీ సైబర్ నేరగాళ్ళు భార్య, భర్తలకు ఇద్దరికీ కాల్ చేసి నమ్మబాలి కారు. వారిని నమ్మిన నూరిల్లా తన సెల్ కు వచ్చిన ఓటీపీ వారికీ చెప్పడంతో వెంటనే అతడి అకౌంట్ నుండి మొదటి సారి 51 వేల 445 రూపాయలు, ,రెండో సారి 51 వేల 475 రూపాయలు. ఇలా విడతల వారీగా లక్షా 85 వేల రూపాయలను కాజేశారు. తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవడాన్ని గమనించిన నూరిళ్ల వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.
క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేస్తామని మోసం
0
217
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


