జీహెచ్ఎంసీలో అన్ని అంశాలపై నివేదికలు కోరిన సర్కార్

   జీహెచ్ఎంసీ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అభివృద్ధి పనులతోపాటు పెండింగ్ పనుల నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో భవిష్యత్ ప్రణాళికలు, బకాయి అంశాలతో పాటు పలు అంశాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే వచ్చే నెల మొదటి వారంలో బల్దియాపై సర్కారు రివ్యూ చేయనున్నట్టు తెలిసింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా ఉంది. ఆస్తులు కలిగిన కార్పొరేషనే అయినా అప్పులు అదే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిస్థితి ఎలా ఉంది. రాబోయే ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికలు ఏంటి ? ప్రస్తుతం ఎన్ని పనులు జరిగాయి ? పెండింగ్ లో ఉన్న పనులు ఎన్ని? ఆస్తులు, అప్పుల లెక్కలు ఏ రకంగా ఉన్నాయి? ఇలా ప్రతి అంశంపై నివేదికలు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని రకాల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గడిచిన వారం రోజుల నుంచి M.A.U.D, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సెక్రటేరియట్ లో వరుస సమీక్షలు చేస్తున్నారు.

    ప్రధానంగా మూసీ డెవలప్ మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైనా సర్కారు ఆరా తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం మూసీ అభివృద్ధి. మూసీని టూరిజం హబ్ లా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్కారు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇతర దేశాలకు వెళ్లి మూసి అభివృద్ధి కార్యక్రమాల నమూనాలను, ఇతర భవిష్యత్ ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి ప్రధాన అంశాలలో నాలాల నిర్మాణం, వర్షాకాలంలో ఎదురవుతున్న సమస్యలను సర్కారు ప్రాధాన్యంగా తీసుకుంది. వర్షాకాలంలో ఇబ్బందుల నుంచి బయట పడేందుకు నాలాల అభివృద్ధితో పాటు, వాటర్ లాగిన్ పాయింట్లు గుర్తించాలని సర్కారు అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ పాయింట్లు గుర్తించి, ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని తెలిపింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ తరహా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ లేదు. ఇదే విషయంపై అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది పాటు అత్యవసరంగా జరగాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని, ఇందుకు సంబంధించి నిధులు ఎంత మేర అవుతాయి.? ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వాలని సర్కారు అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇదే కాక వచ్చే ఐదేళ్ల ముందస్తు ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలపై మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు తెలిపింది. వచ్చే వర్షాకాలంలో నగర ప్రజలకు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరగాల్సిన అభివృద్ధి పనులకు నిధుల విడుదల కోసం వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

జూన్ మొదటి వారంలో మున్సిపల్ శాఖ పై సీఎం రివ్యూ ఉండడంతో ఈ అంశాలన్నిటిపైనా స్పష్టమైన ఆదేశాలు, ప్రణాళికలపై ముందడుగు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, వర్షాకాలం దగ్గర పడుతుండడంతో, అభివృద్ధి పనులు ఏ మేరకు జరుగుతాయనే ఆలోచనలు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, అన్ని ప్రయత్నాలు చేసి, ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు రెడీ అవుతున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్