ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలింగ్ రోజు, ఆ తర్వాత విధ్వంస కాండ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ వరకు నిఘాను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కౌంటింగ్ సమయం దగ్గర పడడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్నవారిపై ఫోకస్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిపై నగర బహిష్కరణవేటు, ఇద్దిరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏపీలో అల్లర్లకు పాల్పడిన 20 మందిపై రౌడీషీట్లు, 55 మందిపై సస్పెక్ట్ షీట్స్ నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి, నలుగురికి సీఆర్పీసీ నోటీసులు అందజేశారు. అనుమానితులను బైండోవర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 803 వాహనాలను సీజ్ చేశారు, 130 ఫోన్లు, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించారు.
ఏపీలో కొనసాగుతున్న కార్డన్ సెర్చ్ ఆపరేషన్
0
170
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


