పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలోని కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటి అందించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. గోదావరిఖనిని ఆనుకొని ఉన్న గోదావరి నది పరివాహక ప్రాంతంలోని సింగరేణి పంప్ హౌస్‌తో పాటు ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ళ, అన్నారం, బ్యారేజీల నుండి పూర్తిస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి నది ఎండిపోయిం దన్నారు. నెల రోజులుగా సింగరేణి కార్మిక కుటుంబాలకు అందిస్తున్న నీరు ఎరుపు, ఆకుపచ్చ రంగులో వస్తుందని వారు ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మిక కుటుంబాల కు సురక్షిత మైన నీరును అందించేలా చర్యలు చేపట్టాలని లేదంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు.
రామగుండం సింగరేణిలో తాగునీటి కోసం కార్మికుల ఆందోళన
0
182
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


