వికారాబాద్ జిల్లా పూడూరులోని పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓ కేసు విషయంలో కడ్మూరుకు చెందిన బీఆ ర్ఎస్ కార్యకర్తలు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్ష్యతో తమపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 13 న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ – కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో కాంగ్రెస్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు FIR నమోదు చేసి నలుగురు వ్యక్తు లను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమకు కనీస సమా చారం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
పూడూరు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
0
179
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


