తెలంగాణ కేబినెట్‌ భేటీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం శాంతికుమారి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వడంతో మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శనివారమే మంత్రివర్గం భేటీ అవ్వాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ కారణంగా మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది.ఆ తర్వాత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది. కొన్ని షరతులు విధించింది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీలోపు చెయ్యాల్సిన అత్యవసర విషయాలను మాత్రమే చర్చించా లంది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించొద్దని తెలిపింది.

కేబినెట్ భేటీ నిర్వహణ కోసం ప్రభుత్వం రెండు రోజుల నుంచి వేచి చూస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా కేబినెట్ భేటీ నిర్వహించడానికి వీలుండదు. ఈ క్రమంలో ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మంత్రివర్గం సమావేశానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ కానుంది. కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఈసీ. జూన్‌ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్‌ 4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరుకావద్దని ఆదేశించింది.ఖరీఫ్ పంట సీజన్ కు సంబంధించిన పంట ప్రణాళికపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ కు సంబంధించి వచ్చిన రిపోర్టుపై మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్