తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పవన్ సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు. జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు. జనం కోసం జన సైనికుడయ్యాడని చెప్పారు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన శక్తిశాలి పవన్ కల్యాణ్ అని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో పవన్ గొంతును వినాలని చిరవంజీవి కోరారు.
పవన్‌ను గెలిపించండి : చిరంజీవి
0
236
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


