జాతీయ హోదా దక్కినా… పూర్తికాని పోలవరం

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం అసలు పనులు 2004లో ప్రారంభమయ్యాయి. సహజంగా ఏ ప్రాజెక్ట్‌ నిర్మించా లన్న కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. అయితే ఈ అనుతులు ఒకేసారి రావు. ఆయా మంత్రిత్వశాఖల నిపుణులు ప్రాజెక్టుల డిజైన్లను, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించిన తరువాత అనుమతులు ఇస్తుంటారు. ఒక్క పోలవరానికే కాదు. అన్ని ప్రాజెక్ట్‌లకు ఇదే నిబంధన వర్తిస్తుంది. పోలవ రానికి కూడా ఇదే నిబంధన వర్తించింది.

  2005లో ఈ ప్రాజెక్ట్‌కు పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే గిరిజన ప్రాంత ప్రజల తరలింపు, వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతులు 2007లో లభించాయి.కాగా అటవీ ప్రాంత వినియోగానికి సంబంధించిన తుది అనుమ తులు 2010లో వచ్చాయి.ఇలా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వరుసగా అనుమతులు తెచ్చుకుంటూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ముందుకు సాగింది. 2014వ సంవత్సరం పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో ఒక కీలకఘట్టం. అదే ఏడాది పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ ప్రకటిం చింది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా వస్తే అనేక లాభాలు కలుగుతాయి. జాతీయ ప్రాజెక్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు అందచేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను ఏకంగా కేంద్ర ప్రభుత్వమే తీసుకున్నట్లు. కాగా జాతీయ హోదా లభించడంతో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం జోరందుకుంటుందని అందరూ భావించారు. అయితే అలా జరగలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత అంటే 2014 మార్చి నుంచి 2017 జనవరి వరకు పోలవరం ప్రాజెక్ట్‌పై పెట్టిన ఖర్చు రూ.3,349.70 కోట్లు.కాగా 2014 మార్చి నుంచి 2017 జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు రూ.2,916.54 కోట్లు. సహజంగా పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నాబార్డు కేంద్రానికి రుణంగా ఇస్తుంది. వీటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఖర్చు చేస్తారు. అయితే అనేకానేక కారణాలతో చాలాకాలం పాటు పోలవరం ప్రాజెక్ట్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరచిపోయింది. అయితే వైఎస్ రాజశేఖరెడ్డి తొలిసారి ముఖ్య మంత్రి అయిన తరువాత పోలవరం నిర్మాణం విషయంలో కొంత కదలిక వచ్చింది. జలయజ్ఞం లో భాగంగా డ్యామ్ పనులతో పాటు కాలువల పనులు కూడా కొంతవరకూ జరిగాయి.

   పోలవరం ప్రాజెక్ట్ కు మరో కోణం ఉంది. పోలవరం నిర్మాణం పూర్తయితే, ఆంధ్రప్రదేశ్‌లో 276 గ్రామాలు, ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు, ఒడిశాలో ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతాయి. దాదాపు 3427.52 ఎకరాల అటవీ భూమి మునిగి పోతుంది. అయితే అలా జరగకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు. ఇదిలా ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణలో ముంపునకు గురవుతాయని భావించిన కొన్ని మండలాలను ఆంధ్ర ప్రదేశ్‌‌లో కలిపారు. ఈ జాబితాలో భద్రాచలం రెవిన్యూ డివిజన్‌లోని కూనవరం, వర రామచంద్రా పురం, చింతూరు, భద్రాచలం మండలాలు అలాగే పాల్వంచ రెవిన్యూ డివిజన్‌లోని వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మండలాలున్నాయి. పోలవరం సాదా సీదా ప్రాజెక్ట్ కావు. ఒక భారీ ప్రాజెక్టు. ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటిని తరలించేం దుకు తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.ఇందులో భాగంగా పట్టిసీమ, పురు షోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. అయితే ఈ ఎత్తిపోతల పథకాలు పోలవరం మౌలిక డిజైన్‌లో భాగం కాదని కేంద్రం పేర్కొంది. కాగా వీటిని రాష్ట్రమే తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది.పట్టిసీమ ఇదొక ఎత్తిపోతల పథకం. పోలవరం మండలంలోని పట్టిసం వద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2015లో దీని నిర్మాణం పూర్తయింది. 2015 డిసెంబరు నాటికి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1299 కోట్లు ఖర్చు చేసింది. కాగా పురుషోత్తమపట్నం మరో ఎత్తి పోతల పథకం. రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం చేపట్టారు. 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్