బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తున్న సింబల్ టెన్షన్

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, సీట్ల సంఖ్య పెంచుకుని సత్తా చాటాలని బీజేపీ చూస్తోంది. ఇక గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం ముమ్మరం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక విషయం మాత్రం టెన్షన్ పెడుతోంది.ఎన్నికలు జరిగిన ప్రతిసారీ గులాబీ పార్టీలో ఇదే గుబులు కనిపిస్తోంది. ఇంతకు గులాబీ పార్టీని టెన్షన్ పెడుతున్న అంశం ఏంటి…?

ఎన్నికల్లో అభ్యర్థుల బలం ఎంత ముఖ్యమో వారి పార్టీ సింబల్‌కు ఉన్న బలం అంతే ముఖ్యం. అందుకే రాజకీయ పార్టీలు బలమైన గుర్తుల కోసం ఈసీని కోరుతుంటాయి. తాజాగా ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్దుల గుర్తులు గుబులుపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు వస్తుండంతో ఆందోళన చెందుతు న్నారు. గతంలో కారు గుర్తును పోలిన గుర్తుల కారణంగా తాము అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తులపై బిఆర్ఎస్ పార్టీ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీలకు గుర్తులు చాలా కీలకం. గుర్తులను చూసే ప్రజలు ఓట్లు వేస్తుంటారు. ఒకే రకమైన గుర్తులుంటే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. గులాబీ పార్టీని ఇప్పుడు ఇదే టెన్షన్ పెడుతోందట. బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. వాటిలో రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కెమెరా, ఓడ, కుట్టు మిషన్, ఆటో రిక్షా, ట్రక్ వంటివి అచ్చం కారులాగే ఉన్నాయని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని కలవర పెట్టిన గుర్తులు మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ అభ్యర్థులను భయపెడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.సికింద్రాబాద్‌లో యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ కుమార్‌కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. ఈవీఎం మెషీన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తు నాలుగో స్థానంలో ఉండగా రోడ్డు రోలర్ గుర్తు 5వ స్థానంలో ఉంది. దీంతో కారును పోలిన గుర్తులు ఒకే చోట ఉండటంతో ఓటర్లు కన్‌ఫ్యుజ్ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించారు. అది కూడా కారు గుర్తును పోలి ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థికి టెన్షన్ మెుదలైంది.

2019 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట స్థానంలో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత బీజేపీ అభ్యర్ది బూర నర్సయ్య గౌడ్ ట్రక్కు,రోడ్డు రోలర్, చపాతి మేకర్ లాంటి గుర్తులు రావడంతో స్పల్ప తేడాతో ఓడిపోయారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్, తాండూరు లాంటి స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్దులు తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత బిఆర్ఎస్ నేతలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అలాంటి గుర్తులు కేటాయించవద్దని కోరిన పలితం లేకుండా పోయింది. చివరకు ఢిల్లీ హై కోర్టును సైతం బిఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. అయినా ఆ పార్టీకి ఊరట లభించ డంలేదు. కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఫ్రీసింబల్స్‌ను తొలగించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంతో గులాబీ పార్టీకి ఎప్పటి లాగే ఈసారి గుర్తుల టెన్షన్ పట్టుకుంది. మరి కారును పోలిన గుర్తుల వలన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు నష్టం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్