పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా మెగాస్టార్‌ చిరంజీవి ఎన్నికల ప్రచారం

పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పీక్స్‌కి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు మద్దుగా మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు వరుణ్‌ తేజ్, సాయి ధరమ్ తేజ్ స్వయంగా నియోజకవర్గంలో ప్రచారం చేయగా, ఇప్పుడు తమ్ముడికి మద్దతుగా అన్న మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచార బరిలోకి దిగారు. తన తమ్ముడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తన గురించి కంటే, జనం గురించి ఎక్కువగా ఆలోచించే పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌దని చిరంజీవి అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అతడు సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా.. రాజకీయాల్లో కి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు. జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడని అన్నారు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం తన తమ్ముడిదన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుం టారు. కానీ పవన్‌ కల్యాణ్‌ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం, మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలని అనిపిస్తోందని చిరంజీవి చెప్పారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్