ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీకి కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తాను నియ మించింది. తక్షణం బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. హరీశ్‌కుమార్ గుప్తా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన హోంశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నారు.ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఏపీకి కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ఈసీకి ఏపీ సీఎస్ పంపించారు. ద్వారకా తిరుమల రావు, హరీశ్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. తాజాగా ఏపీ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
0
243
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


