హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుత ను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి.
చిరుత సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు 4 రోజులుగా ప్రయ త్నాలు కొనసాగిస్తున్నారు. చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఒకే ప్రాంతంలో బోన్ వరకు వచ్చి వెళ్తూ దోబూచులాడుతోంది.గత నెల 28వ తేదీన తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. చిరుత దూకే సమయంలో విమానాశ్రయం గోడకు ఉన్న ఫెన్సింగ్‌కు తగలడం తో అలారం మోగింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిజేయగా వారు రంగంలోకి దిగారు.
చిరుతను బంధించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో సుమారు 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ను ఏర్పాటు చేశారు. అన్ని కెమెరాల్లో చిరుతకు సంబంధించిన విజువల్స్ చిక్కాయి. కలుగులో ఉన్న ఎలుకకు ఉల్లిపాయ ఎర వేసినట్టు దానికి మేకలను ఎరగా వేసి పట్టుకునేందుకు అధికారులు ప్రయత్ని స్తున్నారు. చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ దాదాపు 5 మేకలు ఎర వేశారు. అయితే అది ఎక్కువగా ఒకే ప్రాంతంలో సంచరిస్తూ బోన్ వరకు వచ్చి వెళ్తూ దోబూచులాడుతోంది కానీ లోపలికి మాత్రం వెళ్లడం లేదు. ఈ చిరుతతోపాటు దాని పిల్లలు కూడా ఇదే ప్రాంతంలో సంచరిస్తున్న ట్లుగా అనుమానిస్తు న్నారు. ఈ చిరుత మహబూబ్‌నగర్ పరిసరాల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తు న్నారు. అడవుల్లో జంతువుల ఆవాసాలు దెబ్బతినడం, వేట, నీరు దొరకని పరిస్థితి రావడం, ఇలాంటి సందర్భాల్లో చిరుత పులులు జనావాసాల్లోకి వస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండకాలంకావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.


