కూటమి హామీల్లో వైసీపీ పథకాలు ఎన్ని ?

  వైసీపీ పథకాలనే టీడీపీ, జనసేన కూటమి హామీలుగా చేర్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని వారంటున్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి 15వేలు ఇచ్చాయని టీడీపీ, జనసేన కూటమి హామీ ఇచ్చాయని.. అమ్మ ఒడి కింద సీఎం జగన్‌ ఇప్పటికే ప్రతీ తల్లికి 15వేలు అందిస్తున్నారన్నారు. ఈ మొత్తాన్ని 17వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విదేశీ విద్యాదీవెన పథకం పునరుద్ధరిస్తామని టీడీపీ, జనసేన కూటమి హామీ ఇచ్చాయి. ఇప్పటికే జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో రాష్ట్రంలో అమలవుతోంది. ఒక్కొక్కరికీ లక్షా 25వేల వరకు అందిస్తోంది. కేజీ టూ పీజీ సిలబస్‌ను రివ్యూ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే కేజీ టూ పీజీ సిలబస్‌ను రివ్యూ చేయడమే కాదు… డిగ్రీలో ఆనర్స్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడడానికి కారణమైన జీవో 117ను రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు హయాంలో మూతపడిన 5వేల స్కూళ్ల నుపునరుద్ధరించింది జగన్‌ ప్రభుత్వం. సబ్జెక్ట్‌ టీచర్లను కూడా నియమిం చింది. బీపీ, షుగర్‌ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్‌ మందుల పంపిణీ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వగా.. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్‌, వైఎస్సార్‌ విలేజ్ క్లినిక్‌, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులకు 20వేల పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ, జనసేన కూటమి హామీ ఇవ్వగా.. ఐదేళ్లుగా 13వేల 500 రూపాయల చొప్పున రైతులకు జగన్‌ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. 16వేలకు పెంచుతున్నట్లు మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది వైసీపీ.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్