బిజీ షెడ్యూల్ తో కేసీఆర్ బస్సు యాత్ర

  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ రోడ్డు షో కొనసా గనుంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మహబూబాబాద్ కు చేరుకోనున్నారు కేసీఆర్. ఇల్లందు రోడ్డు లోని ధరణి ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్డు షోలో పాల్గొంటారు.అనంతరం ఇందిరా గాంధీ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం మహబూ బాబాద్ నుండి రాత్రి వరంగల్ కి చేరుకోనున్నారు. రాత్రి వరంగల్ లోనే బస చేయనున్నారు కేసీఆర్‌.

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్‌ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ మానుకోటకు చేరుకోనుంది. మహబూబాబాద్ లోక్ సభ బీఆర్ఎస్‌ అభ్యర్థి మాలోత్ కవిత విజయం కోసం…. సాయంత్రం 6 గంట లకు మహబూబాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు కేసీఆర్. కొత్తగూడెం నుంచి బస్సులో ఇల్లందు బయ్యారం మీదుగా ఆయన మానుకోటకు చేరుకోనున్నారు. కొత్త బజారులోని జిల్లా ఆసుపత్రి నుంచి ఇందిరా సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించి.. ఇందిరాగాంధీ కూడలిలో కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ఇల్లందు, ములుగు నియోజకవర్గాల్లో కొన్ని మండలాల నుంచి బీఆర్ఎస్‌ శ్రేణులు కేసీఆర్ అభిమానులు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్