తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పీక్స్‌కి చేరింది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్ర నేతలు.. రాష్ట్రానికి క్యూ కట్టారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ బీజేపీ అగ్రనేత, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పిక్స్‌కి చేరింది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్ర నేతలు.. రాష్ట్రానికి క్యూ కట్టారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ బీజేపీ అగ్రనేత, కేంద్రం హోం మంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటనకు వస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఇవాళ హైదరాబాద్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తరుపున అమిత్ షా ప్రచారం నిర్వహిస్తారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు లాల్‌దర్వాజలో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు…బీజేపీ పదేళ్ల పాలనను ఇంటింటికి వివరించేలా నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనున్నారు. రేపు ఉదయం దిల్లీకి పయనం కాను న్నారు.మే 5న మరోసారి తెలంగాణకు రానున్నారు. రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం లో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 5వ తేదీ నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు. తెలంగాణలో పర్యటనకు వస్తు న్నారు. బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.


