ఆఫ్రికా దేశంలోని పశ్చిమ కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున రిఫ్ట్ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్ కూలడంతో నీటి ఉద్ధృతి పెరిగి గోడలు కొట్టుకుపో యాయి. ప్రమాదంలో 45మంది మృతి చెందారు. డ్యామ్ నీరు ఒక్కసారిగా ఇళ్లలోకి దూసుకెళ్లడంతో ప్రాణనష్టం సంభవించింది. దీంతో దిగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇళ్లు నీట మునగడంతో పాటు ప్రధాన రహదారి ధ్వంసమైంది. ఆకస్మిక వరద కారణంగా కొందరు గల్లంత య్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కెన్యాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఈ ఏడాది మార్చి నెల మధ్య నుంచి ఆ దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత వర్షపాతం నమోద వుతుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వరద బాధితులు పాఠశాల ల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు కెన్యా ఎయిర్‌పోర్టు కూడా వరద నీటితో నిండిపో యింది. దీంతో కొన్ని విమానాలను దారి మళ్లించవలసి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే, టెర్మినల్స్, కార్గో ప్రాంతమంతా వరద నీటితో నిండిపోయాయి.


