కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సమన్లు జారీ చేసి, మే 1న విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్ తీసుకొని విచారణకు రావాలని సమన్లలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇద్దరు ఢిల్లీ పోలీసు అధికా రులు గాంధీభవన్‌కు వచ్చారు. అయితే, ఇక్కడ సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఒక్కరే అయినందున రేవంత్ కు సమన్లు జారీ చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో సీఎం అందుబాటులో లేకపోవడంతో పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నే సతీష్‌కు నోటీసులు అందజేశారు. సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమిత్‌షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై దిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు
గాంధీభవన్‌కు వచ్చిన ఢిల్లీ పోలీసులు
0
286
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


