రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ఎజెండాలను ఒకసారి పరిశీలిస్తే, నేతలు ఒకరిపై ఓకరు దుమ్మెత్తిపోసుకు నేందుకు కంకణం కట్టుకున్నారా అనిపిస్తోంది. గెలుపు వ్యూహంలో నువ్వా నేనా అనే పోటీలో పడి ఒకరి సక్కదనాలు ఒకరు బయట బెట్టుకుంటున్నారు. ఒకరి వైఫల్యాలను మరొకరు బలంగా మార్చుకు నేందుకు సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు.అయితే అధికార పక్షం మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా ప్రచారం చేస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వస్తే, రాజ్యాంగాన్ని మర్చేస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తారనే సరికొత్త ప్రచారానికి కాంగ్రెస్ తెరలేపింది. బీఆర్ ఎస్ మాత్రం పదేళ్ల పాలనలో చేసిన మంచి పనులను ఏకరువు పెడుతూ..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బస్సు యాత్రతో ముందుకెళుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్యూహంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీ, నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పి స్తుంది. ఇలా ఎవరి అస్త్రాలతో వాళ్లు ఎన్నికల యుద్ధాంలో పోరాటం సలుపుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోపాటు గత ప్రభుత్వ హయంలో జరిగిన వైఫల్యాలను కూడా కాంగ్రెస్ బలంగానే ప్రచారం చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాం…లిక్కర్ స్కాం.. ఇలా అనేక వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజలకు ఎత్తిచూపుతుంది. మొత్తంగా గులాబీ పార్టీనీ మరింత బలహీన పరిచి, ఆ పార్టీ నేతలను వరుసగా కాంగ్రెస్ లో చేర్చుకుంది. ఆ పార్టీ నుంచి వచ్చే వలస నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. వలస నేతల్లో గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ సీట్లు కేటాయించింది. ఎన్నికల ప్రచారం తీవ్ర రూపం దాల్చే సమయానికి, గులాబీ పార్టీని మరింత బలహీన పరిచేందుకు కాంగ్రెస్ బలంగానే ఉచ్చు బింగించింది. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పెద్ద బ్రేకే ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బకు గులాబీ గూడు చెదిరిపోయింది. చాలా చోట్ల నేతలను ..క్యాడర్ ను సైతం కోల్పోయింది గులాబీ పార్టీ. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో రైతులకు కష్టాలు మొదలు అయ్యాయని, రాష్ట్రంలో త్రాగు నీటి, సాగు నీటి కరువు ఏర్పడిందని, కరెంటు కోతలు మొదలు అయ్యాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పిస్తుంది బీఆర్ఎస్. ఈ అంశాలనే ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుంది. పదేళల్లో లేని కరువు కాంగ్రెస్ ఏర్పడిన నాలుగు నెలలలో వచ్చిందని దానికి కాంగ్రెస్ అసమర్ధత, చేతగాని పాలనే కారణమని,ఈ కరువు కారు, ప్రకృతి
తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో పొలాల బాట పట్టారు. జిల్లాల వ్యాప్తంగా దారి పొడవునా, రైతులతో ముచ్చటించి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి సరఫరా చేయకపోవడంతో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చిన నాలుగు నెలల్లోనే 220 మందికి పైగా రైతులు మరణిం చారని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని అయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే కేసిఆర్ చెబుతున్న మాటలను మాత్రం అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తిప్పి కొడుతున్నాయి. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేసిఆర్ కు లేదని, పొలాల్లో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పలకరించిన పాపాన పోలేదని, ప్రభుత్వం ఆదుకోలేదని,లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎంత మంది రైతులకు నష్ట పరిహారం చెల్లించారంటూ బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని, ఎన్నికల వేళ సిఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్యూహంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీ పార్టీ గత బీఆర్ఎస్ వైఫల్యా లను వివరిస్తూనే నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, రామరాజ్యంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుతుంది.వీటితోపాటు ప్రధాని మోడీ ఇమేజ్, అయోధ్యరాముడి ప్రాణప్రతిష్ఠ, రాష్ట్రానికి పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, ఎస్సీ వర్గీకరణ హామీ తదితర అంశాలను ప్రస్థావిస్తూ బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి ఉన్న ఇమేజ్ ను వాడు కొని, రాష్ట్రంలో అత్యధిక సభలు పెట్టేందుకు తెలంగాణ బీజేపీ నాయక త్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బీజేపీ ముఖ్యంగా యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది.
గత అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో కాస్త బలంగానే కనిపించిన బీజేపీ.. ఆ తర్వాత చతికిలపడిందనే చెప్పాలి. బీజేపీ పార్టీని వలసలు కూడా ఇబ్బంది పెట్టాయి. కానీ ప్రధాని మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి తదితర నేతలు ప్రచారాల్లో కీలకంగా ఉండి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. తెలంగాణాలో బీజేపీ పుంజుకోవడానికి విశేషంగా కృషి చేస్తుంది. వాస్తవానికి కర్ణాటకతో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీకి పెద్దగా పట్టు లేదనే చెప్పాలి. మరి ఈ క్రమంలో బీజేపీ ఎంత కృషి చేసినా…మెజార్టీ సీట్లు సాధించే అవకాశం లేదనే అంశాన్ని రాజకీయ విశ్లేషకులు బలంగానే చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేసే దిశగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీకి, కావాలను కుంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఓబీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు 75 శాతానికి చేరతాయన్నారు. అయితే రిజర్వేష న్లను రద్దు చేయాలని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తుందని ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని రేవంత్ రెడ్డి ఊదరకొట్టేస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, బీజేపీ కేంద్రమంత్రి అమిత్ షా సరికొత్త వాదన ఎత్తుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాకపోతే ధరణి, కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు అమిత్షా. ఆయనే కాదు.. కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా కమలనాథు లందరి నోట ఇదే మాట వినిపిస్తోంది. తెలంగాణ పార్లమెంట్ ఫైట్లో బీ టీమ్ డైలాగ్ వార్ మరింత తీవ్రమైంది. దీంతో తెలంగాణ ప్రజానీకమంతా ఎవరికి ఎవరు బీ టీమ్ అనే ప్రశ్న తలెత్తింది. అసలు తెర వెనుక ఏం జరుగుతుంది?అనేది ప్రజల్లో ఆసక్తి కలుగుతోంది .మరి కాంగ్రెస్ ఆరోపిస్తునట్టు కమలనా థులు, గులాబీ దళం ఒక్కటేనా? లేదంటే బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్టు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారా! అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాజకీయ చదరంగంలో కేవలం ఇవన్నీ ఆరో పణలేనా..? లేదంటే రాష్ట్రంలో మద్దతు పాలిటిక్స్ నడుస్తున్నాయా అనేది లక్షడాలర్ల ప్రశ్నగా మిగిలింది.
నరేంద్ర మోడీ పాలనలో పేదల బతుకులు దుర్భరంగా మారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయన్నారు. చేనేత వస్త్రాల నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీని ఎడాపెడా పెంచిందని కేంద్రంపై మండి పడ్డారు రేవంత్ రెడ్డి. జీఎస్టీ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రాల ఆదాయాన్ని, కేంద్రం దోచుకుంటోందని దుయ్య బట్టారు. ఇదిలా ఉండగా తాము అధికారంలోకి వస్తే, ప్రజలకు చేసే మంచి పనులను వివరిస్తూ ఇప్పటికే పాంచ్ న్యాయ్ – పచ్చీస్ గ్యారంటీ పేరుతో మానిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. తమకు గతంలో కలసి వచ్చిన వ్యూహాలనే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. మొత్తంగా చూస్తే, మూడు ప్రధాన పార్టీల నేతలు ప్రచార అస్త్రాలతో ఒకరిపై ఒకరు యాక్షన్ సినిమా రేంజ్ లో సవాళ్లు విసురుకుంటున్నారు. వచ్చే నెలలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలకుఎవరికి తోచిన హామీలు వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు. మరి ప్రజలు ఏ పార్టీకి మెజార్టీ సీట్లు కట్టబెడతారో వేచిచూడాల్సిందే.


