ఆదిలాబాద్ బీజేపీలో ఏం జరుగుతోంది..?

ఆదిలాబాద్ బీజేపీ నామినేషన్ పర్వంలో చిత్ర, విచిత్ర ఘటనలు దర్శనమిచ్చాయి. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థిగా గొడెం నగేష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, పార్టీ సీనియర్ నాయకుడు రాథోడ్ రమేష్ ఒంటరిగా వచ్చి నామినేషన్ వేశారు. దీంతో, పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఆదిలాబాద్ బీజేపీలో అసలేం జరుగుతోంది..? ఆ పార్టీ వ్యూహం ఏమిటి..? వాచ్ దిస్ స్టోరీ.వాయిస్ ః ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అయితే, ఆదిలాబాద్ ఎంపి నియోజకవర్గంలో బీజేపీలో కోల్డ్ వార్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టంలో…ఈ వార్ ప్రస్పుటమైంది. ఎప్పుడో బీ ఫామ్ అందుకున్న ఆ పార్టీ అభ్యర్థి గొడెం నగేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట కమలం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ తంతు ఇలా ఉండగా…బీజేపీ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ విడిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన సైతం బీజేపీ అభ్యర్థిగానే నామినేషన్ వేశారు. నేతల మాట ఎలా ఉన్నా… ఈ చర్య పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేసింది. పార్టీ వ్యతిరేక చర్యా..? లేక రెండో అభ్యర్థి అవకాశం కోసమా..? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. గొడేం నగేష్ ను అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించినప్పటినుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, రామ్ లీలా మైదానంలో పార్టీ ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన పనులను రాథోడ్ రమేష్ పరిశీలించారు. దీంతో, ఆయన అలక వీడారని పార్టీ శ్రేణులు సంతోషించాయి.

అయితే, చడీ చప్పుడు కాకుండా ఒంటరిగా వెళ్లి రాథోడ్ రమేష్ నామినేషన్ వేసేశారు. దీంతో, పార్టీ శ్రేణుల సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. నాయకుల మధ్య సమన్వయం లోపించిందని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఇద్దరిలో ఎవరు పార్టీ అభ్యర్థో, ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక పార్టీ కార్యకర్తలు డైలమాలో పడ్డారు. ఈ ఆకస్మిక పరిణామాలపై బీజేపీలో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇది పార్టీ నిర్ణయామా..? లేదంటే తర్వాత నామినేషన్ ఉపసంహరించుకుంటారా..? స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారా..? ఇలా పలు రీతుల్లో పార్టీ శ్రేణులు చర్చలు సాగిస్తున్నాయి. ఏది ఏమైనా, ఏ హై డ్రామాలు సాగించినా, కార్యకర్తలను కన్ ఫ్యూజన్ లో పెట్టేసి టెన్షన్ కు గురిచేయడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్