34.6 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

లండన్ వీథుల్లో గుర్రాల హల్‌చల్

       నిత్యం రద్దీగా ఉండే లండన్‌ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ హల్‌చల్ చేశాయి. సెంట్రల్‌ లండన్‌ సమీపంలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది తమ గుర్రాలకు శిక్షణనిస్తున్నారు. ఆ సమయం లో గుర్రాలు ఒక్కసారిగా వారిని తోసుకుంటూ వీధుల్లో పరుగెత్తడం ప్రారంభించాయి. వాటి దాడిలో ఒక సైనికుడికి గాయాలయ్యాయి. అనంతరం రెండు గుర్రాలు రద్దీగా ఉన్న రోడ్లపై హల్‌చల్‌ చేయడంతో పాదచారులు, పలువురు వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కొందరు భయభ్రాంతు లకు గురికాగా మరికొందరు ఈ దృశ్యాలను వీడియోల్లో బంధించారు. ఈ వీడియోలను సోషల్‌ మీడియా లో షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. చివరికి లండన్‌లోని లైమ్‌హౌస్‌ సమీపం లోని హైవేపై రెండు గుర్రాలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో ఒకటి బస్సును ఢీకొని గాయాలపాలైందని, మరో గుర్రం కాళ్లకు గాయాలు ఉండడంతో వెటర్నరీ కేర్‌కు తరలించామని చెప్పారు. లండన్‌లోని అధికారిక భవనాల చుట్టూ ఆర్మీ సిబ్బంది గుర్రాలపై తిరుగుతూ పహారా కాస్తుంటారు. దీనికోసం వాటికి ప్రత్యేక శిక్షణ సైతం కల్పిస్తారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్