తెలంగాణ గడ్డపై బీజేపీ అగ్రనేతల టూర్

   తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు రంగంలో దిగుతున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలు తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులు పాల్గొననున్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ నెల 30, మేమూడు, నాలుగు తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ ‍శ్రేణులు ఏర్పాటు చేస్తున్న సభల్లో మోదీ ప్రసంగిం చనున్నారు. కొన్ని జిల్లాలను కలిపే విధంగా సభలను ప్లాన్‌ చేశారు స్థానిక బీజేపీ నేతలు.

    ఈనెల 30న జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఆందోల్‌ నియోజకవర్గంలో బీజేపీ సభకు ఉండ నుంది. ఈ సభకు మోదీ హాజరుకానున్నారు. అలాగే అదే రోజున సాయంత్రం మోదీ. ఐటీ ఉద్యోగులతో శేరిలింగంపల్లి నియోజకవ‍ర్గంలో సమావేశం కానున్నారు. ఇక మే మూడో తేదీన వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్లగొండ పార్లమెంట్‌లను కలుపుతూ మరో సభలో మోదీ పాల్గొంటారు. మరోవైపు మే నాలుగో తేదీన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నారాయణపేటలో చేవేళ్ల పార్లమెంట్‌లో వికారాబాద్‌ సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్