లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 14 సీట్లు గెలుపే లక్ష్యంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. రోజుకు రెండు, మూడు బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ప్రసంగంలో బీఆర్ఎస్, బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లా, సికింద్రాబాద్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు రేవంత్. ఉదయం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ర్యాలీగా బయల్దేరి దానం నాగేందర్ నామినేషన్ వేస్తారు.మధ్యాహ్నం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. మడికొండలో జరిగే జన జాతర సభలో పాల్గొని మాట్లాడనున్నారు. భారీగా జన సమీకరణ కోసం కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. సభను ప్రతిష్టత్మాకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారి వరంగల్ జిల్లాకు వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
నేడు సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
0
214
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


