గులాబీ దళపతి స్కెచ్ ఏమిటి?

  బస్సు యాత్ర ద్వారా గులాబీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారా..? కాంగ్రెస్ హామీలే టార్గెట్‌గా కేసీఆర్ ప్రసంగం ఉంటుందా..? పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఛరిష్మా వర్క్ ఔట్ అవుతుందా..? రైతు అజెండాతో ముందుకు వెళ్తున్న గులాబీ పార్టీకి ఓట్లు రాలుతాయా..? అసలు కేసీఆర్ బస్సు యాత్ర వర్క్ అవుట్ అవుతుందా ?

  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సిద్దమవుతున్నారు. ఈ నెల 24 నుంచి మే 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. మిర్యాలగూడ నుండి ప్రారంభం అయ్యే బస్సు యాత్ర సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 రోజుల పాటు 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ రోడ్ షోలు ఉండే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. 24న కేసీఆర్ తెలంగాణ భవన్ నుండి బస్సులో బయలుదేరి మిర్యాల గూడకు వెళ్తారు.కేసీఆర్ బస్సు యాత్రలో రైతుల అంశం ప్రధాన అజెండాగా ఉండబోతోంది. ఇందులో భాగంగా ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు సాగునీరు, రైతులకు రైతుబంధు, పంటలకు బోనస్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను కేసీఆర్ తెలుసుకుంటారు. రైతుల అంశంపై ఇప్పటికే కేసీఆర్ జిల్లాల పర్యటన చేశారు. దీంతో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మరోసారి రైతు అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్ల నున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికలను తెలంగాణ సెంటిమెంట్‌తోనే బిఆర్ఎస్ ఎదుర్కొంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ సెంటిమెంట్ వర్క ఔట్ కాలేదు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఉండడంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసిన గులాబీ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల అజెండాగా ఎన్నికలకు వెళ్తోంది. అందుకే కేసీఆర్ పొలంబాట, బస్సుయాత్ర లాంటి కార్యక్రమాలతో రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రోడ్ షోలతో గులాబీ పార్టీకి ఓట్లు వస్తాయా అనే టాక్ నడుస్తోంది.

  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఖమ్మం, తల్లాడ కొత్తగూడెంలో రోడ్ షోలు నిర్వహిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మూడు రోజుల పాటు మూడు రోడ్ షోలు నిర్వహిస్తారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెండు రోజులు, మెదక్ పార్లమెంట్ పరిధిలో మూడు రోజులపాటు కేసీఆర్ పర్యటించ నున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని భావించి న్నప్పటికీ కేసీఆర్ ఈ ఆలోచనను విరమించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బహిరంగ సభలతో సభ నిర్వహణ, జన సమీకరణ చేయడం ఇబ్బందిగా మారడంతోపాటుగా ఖర్చు సైతం భారీగా అవుతుండటంతో బహిరంగ సభలను వాయిదా వేశారనే ప్రచారం జరుగుతోంది. మరి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ రోడ్ షోలను ప్రజలుఎలా రిసీవ్ చేసుకుంటారనేది తేలాలంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్